టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన ఫాంటసీ యాక్షన్ డ్రామా 'విశ్వంభర' సినిమాతో బిజీగా ఉన్నారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ దాదాపు పూర్తవచ్చింది. VFX వర్క్ అయ్యాక దీని రిలీజ్ పై క్లారిటీ వస్తుంది. అయితే, మెగాస్టార్ నెక్స్ట్ సినిమా గురించే ఇప్పుడు ఫ్యాన్స్ లో ఫుల్ బజ్ నడుస్తోంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఇటీవల లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది. ఈ సినిమా లాంఛ్ అయినప్పటి నుంచీ క్యాస్టింగ్ పై రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ముఖ్యంగా, మెగాస్టార్ కు విలన్ గా యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ కనిపించనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చిరంజీవికి వీరాభిమాని అయిన కార్తికేయ, గతంలో నాని 'గ్యాంగ్ లీడర్', అజిత్ 'వలిమై' వంటి సినిమాల్లో విలన్ గా అదరగొట్టాడు. ఈ వార్త నిజమైతే కార్తికేయకు ఇదో బంపర్ ఆఫర్ అనే చర్చ కూడా నడిచింది.

అయితే, టీమ్ కి దగ్గరగా ఉన్న వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ వార్తలు కేవలం పుకార్లేనని తేలింది. ప్రస్తుతానికి కార్తికేయ ఈ ప్రాజెక్ట్ లో లేడని వారు స్పష్టం చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు కనిపిస్తారు అనే దానిపై కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదితి రావు హైదరిని ప్రధాన పాత్ర కోసం సంప్రదించినట్లు కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. నయనతార, ఐశ్వర్య రాజేష్ వంటి స్టార్ హీరోయిన్స్ పేర్లు కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

వీటితో పాటు, విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో ఓ కీలకమైన గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని బలంగా వినిపిస్తోంది. ఇది ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెలతో పాటు సాహు గారపాటి కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. ఈ సినిమాను సంక్రాంతి 2026 కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అనిల్ రావిపూడి ఇటీవల తన చిత్ర బృందాన్ని పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అయితే, మెగాస్టార్ చిరంజీవి తప్ప, ఇందులో నటిస్తున్న ఇతర నటీనటుల పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి స్క్రిప్ట్ ఫైనల్ చేయడంతో పాటు, షూటింగ్ లోకేషన్స్ లాక్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. త్వరలోనే నటీనటులపై పూర్తి క్లారిటీ వస్తుందని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: