న్యాచురల్ స్టార్ నాని మరికొన్ని గంటల్లో హిట్3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాని రెమ్యునరేషన్ 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. నానిసినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని తన మనస్సులోని భయం గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
 
పాపులారిటీ పెరిగితే నేనేమైనా మారిపోతానేమో అని భయం వేస్తుందని నాని చెప్పుకొచ్చారు. నన్ను నేను కోల్పోతానేమో అని భయం నాలో ఉండేదని నాని కామెంట్లు చేశారు. నా ఆలోచనల్లో నా ప్రవర్తనల్లో ఏమైనా మార్పు వస్తుందేమో అన్న అనుమానం కలిగేదని ఆయన తెలిపారు. నాని చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
ఎందుకంటే నా చుట్టూ ఉన్న కొందరు నిజంగానే వారి స్థాయి పెరిగేకొద్దీ మారిపోయారని అయితే ఏళ్లు గడిచే కొద్దీ ఫేమ్ వచ్చినంత మాత్రాన మనలో మార్పు రాదని తెలుసుకున్నానని నాని పేర్కొన్నారు. పాపులారిటీకి వ్యక్తిత్వానికి సంబంధం లేదని అర్థమైందని నాని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. నాని హిట్3 సినిమాతో ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.
 
న్యాచురల్ స్టార్ నాని నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా హిట్3, ది ప్యారడైజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి. నాని సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులు ఒకింత భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. హిట్3 సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. అన్ని ఏరియాలలో హిట్3 మూవీ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయనే సంగతి తెలిసిందే. నాని భవిష్యత్తు రోజుల్లో సైతం హిట్ సిరీస్ లలో భాగమవుతారేమో చూడాలి. హిట్3 క్లైమాక్స్ లో కోలీవుడ్ హీరో కార్తీ కనిపించనునారని ప్రచారం జరుగుతోంది. నాని రేంజ్ పెరుగుతుండటం గమనార్హం.




 


మరింత సమాచారం తెలుసుకోండి: