దగ్గుబాటి హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ హీరో ఒకానొక సమయంలో చిత్రపరిశ్రమను తన సినిమాలతో మంచి స్థానంలో నిలిపారని చెప్పవచ్చు. వెంకటేష్ నటించిన సినిమాలన్నీ ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఉంటాయి. కామెడీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న సినిమాలని వెంకటేష్ ఎక్కువగా తీస్తూ ఉంటాడు. ముఖ్యంగా వెంకటేష్ సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు. వెంకటేష్ వయసు పెరిగినా కూడా ఇప్పటికీ వరుసగా సినిమాలలో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. 

రీసెంట్ గా వెంకటేష్ నటించిన తాజా చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం''. ఈ సినిమాతో వెంకటేష్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా....మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోని అత్యంత ఎక్కువ కలెక్షన్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా అనంతరం వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి తన తదుపరి సినిమాను తీయబోతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలని అనుకుంటున్నారట.

అనంతరం వెంకటేష్ తో కలిసి సినిమా తీసే ప్లాన్ లో ఉన్నారట. ఇప్పటికే ఈ సినిమా సంబంధించిన కథను సిద్ధం చేసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారట. ఆ సినిమా కథకు వెంకటేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాను మరో ఆరు నెలల తర్వాత ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారట. దానికి గల కారణం వెంకటేష్ కాలుకి ఫ్రాక్చర్ అయినట్లుగా సమాచారం అందుతుంది. వెంకటేష్ ప్రస్తుతం నడవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ పూర్తిగా కోలుకున్న అనంతరం ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించాలని అనుకుంటున్నారట. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: