టాలీవుడ్ నటుడు ప్రియదర్శి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల్లో హీరోగా నటిస్తూ మంచి విజయాలను అందుకుంటు కెరియర్ను ఫుల్ జోష్లో ముందుకు సాగిస్తున్నాడు. కొంత కాలం క్రితం ప్రియదర్శి "కోర్టు" అనే సినిమాలో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. కోర్ట్ లాంటి భారీ విజయం తర్వాత ప్రియదర్శి హీరోగా రూపొందిన సారంగపాణి జాతకం సినిమా తాజాగా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకునే అవకాశాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబందించిన 4 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసు కుందాం.

మూడు రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 68 లక్షల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్లో 82 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 4 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.50 కోట్ల షేర్ ... 2.90 గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక 4 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో కలుపుకొని 35 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 4 రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 1.85 కోట్ల షేర్ ... 3.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే ఈ మూవీ 4.50 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 2.65 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ను అనుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: