తమిళ నటుడు సూర్య తాజాగా రెట్రో అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా ... కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఈ రోజు అనగా మే 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై జనాలు మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమా ఎన్ని కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగబోతోంది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి తమిళనాడు ఏరియాలో 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ మూవీ కి కర్ణాటక ఏరియాలో 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5 కోట్లు , ఓవర్సీస్ లో 18 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 80.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 82 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 82 కోట్ల షేర్ కలక్షన్లు దక్కినట్లయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ను అందుకుంటుంది. ఇక ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 160 నుండి 165 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసినా కూడా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: