
ముఖ్యంగా రివ్యూస్ వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దర్శకనిర్మాతలు, హీరోలు, మరి కొన్ని సందర్భాలలో రాజకీయాలను సినిమాలకు లింకు పెట్టడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా హీరో నాని కి ఒక భారీ షాక్ తగిలింది.. నిన్నటి రోజున భారీ అంచనాల మధ్య నాని నటించిన హిట్ 3 సినిమా విడుదల అయ్యింది. టాక్ పరంగా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ఈ సినిమాకి ఇప్పుడు భారీ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది.
అదేమిటంటే బారి అంచనాల మధ్య విడుదలైన హిట్ 3 సినిమా 24 గంటలు గడపకు ముందే ఆన్లైన్లోకి హెచ్డి ప్రింట్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా అభిమానులను కలవరపరుస్తోంది. పైరసీ కట్టడి చేయడం కోసం ఇప్పటికే ఎన్నో చేసినప్పటికీ చిత్ర పరిశ్రమను ఈ పైరసీ భూతం నుంచి కాపాడుకోలేకపోతున్నారు. వీటిపైన ప్రభుత్వ పెద్దలను కూడా కలవడం జరిగింది. అయినా కూడా పైరసీ భూతం అనేది మాత్రం సినీ ఇండస్ట్రీ ఎదుగుదలను కుదిపేస్తోందని చెప్పవచ్చు. హిట్ 3 సక్సెస్ సెలబ్రేషన్స్ ని చిత్ర బృందం చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా సినిమా ఆన్లైన్ హెచ్డి ప్రింట్ లింక్ అవ్వడంపై ఇప్పటివరకు చిత్ర బృందం మాత్రం ఏ విధంగా స్పందించలేదు మరి రాబోయే కొన్ని గంటలలో నాని గాని ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.