
ఇక సినిమా ప్రీమియర్ షోస్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో.. కలెక్షన్ల పరంగా సత్తచాటుకుంది. కాగా ఈ సినిమాలో నాని మునుపేనాడు లేని విధంగా వైలెన్స్ సృష్టిస్తూ ఊర మాస్ నాటు లుక్ లో స్క్రీన్ పై బ్లడ్ బాత్ చేశాడు. ఇక సినిమాకు నాని నటన హైలెట్ గా నిలిచింది. జాలి లేని పోలీస్ ఆఫీసర్గా నాని తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఈ క్రమంలోనే సినిమా మొదటి రోజు 90% ఆక్యుపెన్సిని సొంతం చేసుకొన్న నాని.. ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టాడు. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా వెల్లడించారు.
ఈ క్రమంలోనే సెకండ్ డే కలెక్షన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అనే ఆసక్తి అభిమానులలో మొదలైంది. ఇక సినిమా సెకండ్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ. 8 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టగా నైజాంలో రూ. 5 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.62 కోట్ల గ్రాస్ వసూళను కొల్లగొట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. అలా నాని సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకే 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయి రికార్డ్ క్రియేట్ చేసింది ఇక నేడు, రేపు వీకెండ్స్ కావడంతో కలెక్షన్లు మరింతగా పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే జోరు కొనసాగితే సినిమా లాంగ్ రన్ లో మరిన్ని లాభాలు కొల్లగొట్టే అవకాశం ఉంది. ఇక నాని గారు ఫుల్ రన్‌లో ఎలాంటి రికార్డ్‌లు క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి.