టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ అవైడెడ్ చిత్రంగా ఉన్న చిత్రాలలో రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న SSMB -29. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటు అటు అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు , ఇతర దేశాలు సైతం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా బిజీలో రాజమౌళి ఉన్నారు. మహేష్ బాబు కూడా సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా అప్పుడప్పుడు వైరల్ గా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇలాంటి కాంబినేషన్ సినిమా రాబోతోందని తెలిసి అందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.


ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్ గా మహేష్ బాబు కనిపించబోతున్నట్లు సమాచారం ఈ మేరకు మహేష్ బాబును ఆ విధంగా రాజమౌళి రెడీ చేస్తున్నారట.. ఆర్కియాలజిస్ట్ పాత్రలో మహేష్ బాబు కనిపించడమే కాకుండా ఈ పాత్రలో కామెడీతో కూడా అలరించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అన్ని సినిమాల కంటే ఈ సినిమా చాలా డిఫరెంట్గా చేయబోతున్నారని ఈ చిత్రంలో ఎక్కువ కామెడీ పెట్టేందుకు రాజమౌళి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాను హైదరాబాద్ తో పాటు వారణాసి వంటి ప్రాంతాలలో కూడా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు ప్రాంతాలలో ఈ చిత్రానికి సంబంధించి సినిమా షూటింగ్ సెట్లను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. వారణాసిలో జూన్ 10వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నదట. మరి ఇందుకు సంబంధించి చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి అక్కడక్కడ పలు రకాల లీక్స్ వైరల్ గా మారుతున్నాయి.అయినప్పటికీ కూడా రాజమౌళి వీటన్నిటిని ఈసారి పట్టించుకోకుండా తనదైన స్టైల్ సినిమా చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. మొత్తానికి ఒక విభిన్నమైన పాత్రలో మహేష్ బాబును చూపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: