హిందీ నటుడు అజయ్ దేవ్ గన్ కొన్ని సంవత్సరాల క్రితం రైడ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుము విడుదల ఆయన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా అజయ్ దేవ్ గన్ కి మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే రైడ్ సినిమా వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. రైడ్ మూవీ వచ్చి ఇప్పటికే చాలా కాలం అయిన కూడా ఆ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో కొంత కాలం క్రితమే ఆ మూవీ కి కొనసాగింపుగా రైట్ 2 అనే మూవీ ని ప్రారంభించారు.

సినిమా యొక్క షూటింగ్ను చాలా స్పీడ్ గా పూర్తి చేసి ఈ మూవీ ని పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల చేశారు. రైడ్ మూవీ మంచి విజయం సాధించి ఉండడం , ఆ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన సినిమా కావడంతో రైడ్ 2 మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ పెద్ద ఎత్తున విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ఈ సినిమాకు ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 3 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమాకు రో జువారిగా ఎన్ని కలక్షన్స్ వచ్చాయి. మూడు రోజుల్లో మొత్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనే విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు.

తాజాగా ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన పోస్టర్ ప్రకారం ఈ సినిమాకు మొదటి రోజు 19.71 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండవ రోజు 13.05 కోట్లు , మూడవ రోజు 18.55 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు మూడు రోజుల్లో 51.31 కోట్ల కలెక్షన్లు దక్కినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ad