ఈ మధ్య కాలంలో ఓ టీ టీ లో సినిమాలను వీక్షించే ప్రేక్షకుల శాతం చాలా వరకు పెరిగిపోతూ వస్తుంది. దానితో ఓ టీ టీ ప్లాట్ ఫామ్ వారు కూడా ప్రతి వారం తమ ఓ టీ టీ ప్లాట్ లోకి లోకి పెద్ద ఎత్తున కంటెంట్ను తీసుకువస్తూ ఉన్నారు. ఇకపోతే ఓ టీ టీ లో సినిమాలను వీక్షించడానికి చాలా అలవాటు పడ్డ వారు ప్రతి వారం ఏ ఓ టి టి లోకి ఏ కంటెంట్ వస్తుంది అనే దానిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉంటారు. ఇకపోతే ఈ వారం ఓ టీ టీ లోకి రెండు క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవి ..? అవి ఏ తేదీన ఏ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

తాజాగా తమిళ నటుడు అజిత్ కుమార్ , అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించారు. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఇకపోతే ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ మూవీ ని మే 8 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ వారు తమిళ్ , హిందీ , తెలుగు , కన్నడ , మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా నెట్ ఫ్లిక్స్ ఓ టి టి సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నట్లు ఒకరు అయినటువంటి నితిన్ తాజాగా రాబిన్ హుడ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. శ్రీ లీల ఈ మూవీలో హీరోయిన్గా నటించగా ... వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే ఈ సినిమా యొక్క ఓ టి టి హక్కులను జీ 5 సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను మే 10 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ 5 సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: