టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటులలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఈయన ఈ మధ్య కాలంలో వరుస పెట్టి అద్భుతమైన విజయాలు అందుకుంటూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం దసరా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాని అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఆ తర్వాత నాని నటించిన హాయ్ నాన్న , సరిపోదా శనివారం సినిమాలు కూడా వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇలా ఇప్పటికే వరసగా మూడు విజయాలను అందుకున్న నాని తాజాగా హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా ... శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ , హిట్ ది సెకండ్ కేస్ మూవీలు మంచి విజయాలు సాధించడంతో మొదటి నుండి హిట్ ది థర్డ్ కేస్ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా మే 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కు మంచి టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చింది. దానితో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి.

మరి ముఖ్యంగా ఈ సినిమాకు నార్త్ అమెరికాలో కలెక్షన్లు అద్భుతంగా దక్కుతున్నాయి. తాజాగా ఈ మూవీ నార్త్ అమెరికాలో 2 మిలియన్ ప్లస్ కలెక్షన్లను వసూలు చేసినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే నాని నటించిన మరికొన్ని సినిమాలు కూడా నార్త్ అమెరికాలో 2 మిలియన్ ప్లేస్ కలెక్షన్లను వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: