తమిళ నటులు అయినటువంటి సూర్య , కార్తీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ అన్నదమ్ములు. మొదటగా సూర్య సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాక తన సోదరుడు అయినటువంటి కార్తీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. వీరిద్దరికి తమిళ ఇండస్ట్రీలో తో పాటు తెలుగు ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరూ నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో చాలా సినిమాలు తెలుగు బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో ఈ ఇద్దరికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఉంది.

ఇకపోతే ప్రస్తుతం సూర్య , ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటి వరకు మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ను సూర్య 45 అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ పూర్తి చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా విడుదల చేయాలి అని ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కార్తీ కొంత కాలం క్రితం సర్దార్ అనే సినిమాలో హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే.

ప్రస్తుతం కార్తీ "సర్దార్" మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న సర్దార్ 2 అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను కూడా ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ ఇద్దరి సినిమాలు కనుక దీపావళికి విడుదల అయినట్లయితే ఈ రెండు సినిమాల మధ్య పెద్ద క్లాష్ ఏర్పడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఇద్దరికీ కాస్త నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: