సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే నటీమణులలో కొంతమందికి చాలా తక్కువ సమయంలోనే అద్భుతమైన విజయాలు , అద్భుతమైన గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలాంటి వారు చాలా తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్స్ స్టేటస్ కి చేరుకునే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి. స్టార్ హీరోయిన్ స్టేటస్కు చేరుకున్న తర్వాత వారు మరో ఇండస్ట్రీలోకి వెళ్లడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపరు. కానీ ఓ ముద్దుగుమ్మ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకొని , అద్భుతమైన అవకాశాలను దక్కించుకుంటున్న సమయంలోనే తమిళ , హిందీ సినిమాల్లో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఆ ఇండస్ట్రీ సినిమాలోని నటిస్తూ తెలుగు ఇండస్ట్రీకి దూరం అయింది.

ఇంతకు ఆ నటి ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్. ఈ బ్యూటీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో తెలుగు తెరకు పరచడం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ఈమెకు ఆ సినిమాలలో చాలా సినిమాల ద్వారా మంచి విజయాలు కూడా దక్కడంతో ఈమె చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్టేటస్కు చేరుకుంది. ఇక తెలుగులో స్టార్ హీరోయిన్గా కంటిన్యూ అవుతూ వరుస విజయాలను దక్కించుకుంటున్న సమయంలోనే ఈమె తెలుగు సినీ పరిశ్రమకు దూరం అయ్యి కేవలం తమిళ , హిందీ సినిమాలలో నటిస్తోంది. ఈమె ఆఖరుగా తెలుగులో కొండపొలం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. కానీ అప్పటి నుండి ఈమె ఒక్క తెలుగు సినిమాలో నటించలేదు. అలాగే ఏ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. టాలీవుడ్ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సమయంలోనే ఈమె తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉండటంతో ఈమెను అభిమానించే తెలుగు అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: