
అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేస్తారు అని ఆశలు పెట్టుకుంటున్నారు. అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యేంత సినిమా షూటింగ్ ఇప్పటివరకు జరగనే జరగలేదు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కే సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయితే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ అశలు పెట్టుకుంటున్నారు. కానీ అంత సీన్ లేనేలేదు . ఇప్పటివరకు అంత షెడ్యూల్ సినిమా షూటింగ్ కంప్లీట్ కాలేదు . ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది అంటూ తెలుస్తుంది.
దేవర 2 నుంచి కూడా ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో రివీల్ చేయబోతున్నారు తప్పిస్తే ఎక్కడ ట్రైలర్ రిలీజ్ చేసేంత సాహసం చేయలేకపోతున్నారు మూవీ టీం. దానికి కారణం సినిమాకి సంబంధించిన షెడ్యూల్స్ చాలా స్లోగా ముందుకు వెళుతూ ఉండడమే. అందుకే ముందుగానే హెచ్చరించేస్తున్నారు జనాలు . జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయండి.. ట్రైలర్స్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. దీంతో తారక్ బర్త డే కి ఫ్యాన్స్ కూసింత డిసప్పాయింట్ మెంట్ అవ్వక తప్పదు అనే పోజీషన్ కనిపిస్తుంది..!