ప్రపంచ వ్యాప్తంగా ఏ రెండు దేశాల మధ్య యుద్ధాలు జరిగినా కూడా ఆ రెండు దేశాల స్టాక్ మార్కెట్ల పై ఆ ప్రభావం చూపడం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆ ప్రభావం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ రోజు భారత్ , పాక్ పై దాడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా దాడి చేయడం ద్వారా భారత స్టాక్ మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందా అని ఈ రోజు ఉదయం నుండి జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఇకపోతే భారత దేశ స్టాక్ మార్కెట్ విషయాల్లోకి వెళితే ... ఈ రోజు అర్ధరాత్రి ఒక్క సారిగా భారత దేశం , పాకిస్తాన్ పై దాడి చేసింది. ఈ విషయం ఉదయం వరకు దేశవ్యాప్తంగా సంచలన వార్తగా మారిపోయింది.

దీనితో భారత్ స్టాక్ మార్కెట్ ఎలా స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ఎలా స్టాక్ మార్కెట్ల పని తీరుఉంటుంది అని ఎంతో మంది ఆర్థిక వేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఇకపోతే చాలా మంది ఈ రోజు భారత స్టాక్ మార్కెట్ నష్టాల్లో స్టార్ట్ అవుతుంది అని , ఆల్మోస్ట్ నష్టాల్లోనే క్లోజ్ అవుతుంది అని అంచనా వేశారు. ఇకపోతే చాలా మంది అంచనా వేసినట్లుగానే ఈ రోజు భారత స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే స్టార్ట్ అయింది.

కానీ చాలా మంది అంచనా వేసినట్లు ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లో నష్టాల్లో క్లోజ్ కాలేదు. లాభాల్లోనే క్లోజ్ అయ్యింది. దీనితో చాలా మంది భారత్ , పాకిస్తాన్ యుద్ధం వల్ల భారత స్టాక్ మార్కెట్ పై పెద్దగా ప్రభావం చూపలేదు అని , ఇది ఇలాగే కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో గొప్ప వార్త అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ యుద్ధం కారణంగా భారత స్టాక్ మార్కెట్లో ఎలా ముందుకు వెళతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: