టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకరు. బాలకృష్ణ ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించాడు. బాలకృష్ణ తన కెరీర్లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధించగా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇకపోతే కొంత కాలం క్రితం బాలకృష్ణ దగ్గరకు ఓ సినిమా రాగా అందులో తాను కంటే కూడా పవన్ కళ్యాణ్ అద్భుతంగా సెట్ అవుతాడు అని పవన్ కళ్యాణ్ పేరును సూచించాడట. ఇంతకు బాలకృష్ణసినిమా విషయంలో పవన్ కళ్యాణ్ పేరు సూచించాడు అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం మలయాళం లో అయ్యప్పనున్ కొషియన్ అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సూర్య దేవర నాగ వంశీ దక్కించుకున్నాడు. అందులో భాగంగా నాగ వంశీ ఇందులో ఒక పాత్ర కోసం బాలకృష్ణ ను సంప్రదించి అతనికి ఆ సినిమా మొత్తం చూపించాడట. సినిమా మొత్తం చూసిన బాలకృష్ణ సినిమా బాగుంది. అందులో నువ్వు నన్ను చేయమంటున్న పాత్ర కూడా చాలా బాగుంది. కానీ ఆ పాత్రలో నాకంటే కూడా పవన్ కళ్యాణ్ అద్భుతంగా సెట్ అవుతాడు. పవన్ కళ్యాణ్ ను ఒక సారి సంప్రదించండి అని అన్నాడట. దానితో నాగ వంశీ , పవన్ కళ్యాణ్ ను సంప్రదించగా ఆయనకు ఆ సినిమా , అందులో ఆయనను అనుకుంటున్నా పాత్ర అద్భుతంగా నచ్చడంతో వెంటనే ఆ మూవీ తెలుగు రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఆ తర్వాత ఆ సినిమాను భీమ్లా నాయక్ అనే టైటిల్ తో పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా రూపొందించగా ... ఆ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: