
టాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా సత్తా చాటుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే వేదికగా అలరించబోతున్నాడు. అది కూడా ఈ రోజే. అసలీ రోజు ఏంటి స్పెషల్..? ఆ ముగ్గురు హీరోలు ఎక్కడ కలవబోతున్నారు..? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఇండస్ట్రీ హిట్ మూవీ ` ఆర్ఆర్ఆర్ ` ఇప్పటికే ఆస్కార్ సహా అనేక అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఎన్నో రికార్డులను తిరగరాసింది.
ఇప్పుడు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించబోతుంది. నేడు(మే 11, 2025) ఆర్ఆర్ఆర్ చిత్రం లండన్‌లోని ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో అద్భుతమైన లైవ్ కచేరీతో స్క్రీనింగ్ కాబోతుంది. బాహుబలి 2 తర్వాత భారతీయ చిత్రాల్లో ఈ ఘటన దక్కింది ఆర్ఆర్ఆర్‌కే. సినిమా ప్రదర్శన అనంతరం బెన్ పోప్ నేతృత్వంలో ప్రముఖ రాయల్ ఫిల్‌హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రాతో కలిసి కీరవాణి ఆర్ఆర్ఆర్ సంగీతాన్ని లైవ్ లో వినిపించనున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే ఎన్టీఆర్ లండర్ చేరుకున్నారు. అలాగే తన మైనపు విగ్రహావిష్కరణ నేపథ్యంలో కొద్ది రోజుల నుంచి లండన్‌లోనే ఉన్న రామ్ చరణ్.. ఈ ప్రత్యేక కార్యక్రమానికి భార్య ఉపాసన, తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖలతో కలిసి హాజరుకానున్నారు. ఇక ఈ ఆర్ఆర్ఆర్ గ్రాండ్ ఈవెంట్ లో మరొకరు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నారు. ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు. రాజమౌళి ఆహ్వానం మేరకు మహేష్ బాబు కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి ఆల్బర్ట్ హాల్‌లో జరగనున్న ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్ ప్రదర్శనలో సందడి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలియగానే ముగ్గురు హీరోల అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు.
కాగా, ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో ఓ పాన్ వరల్డ్ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ` SSMB 29 ` వర్కింగ్ టైటిల్ తో వీరి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. శ్రీదుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఎస్ఎస్ఎమ్‌బీ29 చిత్రాన్ని కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు