
ఎన్టీఆర్ మూవీ ప్రారంభత్సవం కావడం భువనేశ్వరి క్లాప్ కొట్టి ఆశీర్వదించారు. నందమూరి మోహన్ కృష్ణ మొదటి షాట్ కు దర్శకత్వం వహించారు . బాలకృష్ణ సతీమణి వసుంధర ..దగ్గుబాటి పురందేశ్వరి ..గారపాటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ వేడుకలో పాల్గొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే ఈ కార్యక్రమంలో ఫోర్త్ జనరేషన్ ఎన్టీఆర్ మాట్లాడిన స్పీచ్ తాలూకా వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . "మా ముత్తాత నందమూరి తారక రామారావు గారు ఆయన పక్కన నిలబడి చూసే మా తాత హరికృష్ణ గారు అలాగే మా నాన్న జానకిరామ్ గారి ఆశీస్సులు ఎప్పటికీ నాతోనే ఉంటాయి అనే నమ్మకం నాలో ఇప్పటికీ ఉంది . ఈరోజు మా తాతలు ..అమ్ములు.. బాబాయిలు ..నానమ్మ మొత్తం నన్ను ప్రోత్సహిస్తున్నారు ..మీ సహాయం సహకారం కూడా నాకు కావాలి ..నేను వేయబోయే ప్రతి స్టెప్ లోనూ మీ ఎంకరేజ్మెంట్ తోడైతే నాకు చాలా ఆనందం. ఇది నాకు చాలా చాలా స్పెషల్ మూమెంట్ " అంటూ ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో మాట్లాడి ఆకట్టుకున్నాడు.
అయితే ఎన్టీఆర్ మాట్లాడిన మాటల తాలూకా స్పీచ్ వీడియో వైరల్ గా మారింది. చాలామంది ఈ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలను ట్రోల్ చేస్తున్నారు . "నువ్వు మాట్లాడిన మాటలు అంతా కూడా నీ కుటుంబం గురించి నీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పుకున్నావే కానీ ఎక్కడ నీ టాలెంట్ ను బయట పెట్టలేదు అని.. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు "> నందమూరి ఫ్యామిలీ అండ చూసుకొని నువ్వు హిట్ కొట్టాలి అనుకుంటున్నావా..? అంటూ మరికొందరు సెటైర్స్ వేస్తున్నారు . స్పీచ్ మొత్తంలో తాత - నాన్న- అమ్మమ్మలు - తాతలు పేర్లు చెప్పుకునే వచ్చావు అని ..ఇతగాడు ఇక హీరోగా ఏం సెటిల్ అవుతాడు అంటూ దారుణాంగా మాట్లాడుతున్నారు. మరి కొంతమంది మాత్రం ఫస్ట్ స్పీచ్ లోనే ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ చూపించారు నెక్స్ట్ ఇండస్ట్రీలో మంచి హీరోగా సెటిల్ అవుతాడు అంటూ ఆశీర్వదిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో ..? తారక రామారావు పేరు ఎలా మారుమ్రోగిపోతుందో..?