
మన దేశ సైన్యం పాకిస్తాన్ కు ధీటుగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. అలియా భట్ తన పోస్ట్ లో కొన్ని రోజులు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని నిశ్శబ్దమే వినిపించిందని ఆమె చెప్పుకొచ్చారు. అంతా ఆందోళన నెలకొందని ప్రతి మాట, వార్త వెనుక ఒకరకమైన టెన్షన్ అని అలియా భట్ కామెంట్లు చేశారు. ఆదివారం మనమంతా మదర్స్ డేను సంతోషంగా చేసుకున్నామని ఆమె వెల్లడించారు.
మనం ఆలింగనాలు ఇచ్చి పుచ్చుకున్నామని అలియా భట్ అన్నారు. దేశ రక్షణ కొరకు హీరోలను పెంచిన తల్లుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయానని అలియా భట్ కామెంట్లు చేశారు. వారిది అంతులేని త్యాగం అని ప్రతి సైనికుడి యూనిఫామ్ వెనుక నిద్ర లేని రాత్రులు గడిపే అతని తల్లి ఉంటుందని అలియా భట్ చెప్పుకొచ్చారు. తన బిడ్డకు ఏ రాత్రి జోలపాటలా ఉండదని తల్లికి తెలుసని ఆమె అన్నారు.
ఒత్తిడితో కూడిన నిశ్శబ్దం ఏ క్షణమైనా బద్దలు కావచ్చని ప్రతి రాత్రి ఉద్రిక్తతలు లేని ప్రశాంతతను కోరుకుంటున్నామని అలియా భట్ కామెంట్లు చేశారు. ఆ తల్లీదండ్రుల ధైర్యం దేశాన్ని ఎంతగానో కదిలిస్తోందని ఆమె పేర్కొన్నారు. పంటి బిగువున బాధను నొక్కిపెట్టిన వారికి ప్రతిక్షణం అండగా ఉంటామని తెలిపారు. మా రక్షకుల కోసం, ఈ దేశం కోసం కలిసి నిలబడతామని అలియా భట్ అన్నారు. అలియా భట్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.