అక్కినేని కోడలు శోభిత ధూళిపాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మోడల్ గా తన కెరీర్ ప్రారంభించిన శోభిత ధూళిపాల అనేక సినిమాలలో హీరోయిన్ గా నటించింది. తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. శోభిత తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ సినిమాలలో నటించి సక్సెస్ సాధించింది. తెలుగులో ఈ భామ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎనలేని గుర్తింపు అందుకుంది. ఇక అక్కినేని నాగచైతన్యతో ప్రేమ, వివాహం తర్వాత శోభిత ఏదో ఒక వార్తతో నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నారు. 

తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఏదో ఒకటి తన అభిమానులు వైరల్ చేస్తూనే ఉన్నారు. వివాహం తర్వాత శోభిత అనేక రకాల సవాళ్లను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని సైతం దాటుకుంటూ ముందుకు వెళ్తోంది. కాగా, ప్రస్తుతం శోభితకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. అందులో శోభితం బికినీ ధరించి సముద్రం చివరన ఎంజాయ్ చేస్తోంది. అయితే ఈ వీడియోను చూసి చాలామంది నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.


అయితే ఇదేదైనా సినిమా షూటింగ్ లో ఓ భాగమా లేకపోతే నిజంగానే శోభిత ఇలా బట్టలు ధరించడం ఏంటని కొంతమంది అంటున్నారు. ఇది షూటింగ్ లో ఓ భాగం అని కొంతమంది అంటుంటే మరి కొంతమంది కాదని అంటున్నారు. ఇంత ఓవర్ గా ఎక్స్పోజింగ్ చేయడం అవసరమా అని పలువురు నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఒకప్పుడు ఎంతో పద్ధతిగా కనిపించే దానివి. ఇప్పుడేంటి ఇలా బరితెగించి నటిస్తున్నావని ఫైర్ అవుతున్నారు. కానీ ఇదంతా శోభిత తన వివాహానికి ముందు ఇలా నటించిందని చూస్తేనే అర్థమవుతుంది. దీనిపై శోభిత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: