మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కన్నడ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఈమె ఛలో అనే మూవీ తో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా ఈమె అనేక సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్థాయిలో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ్ , హిందీ సినిమాల్లో కూడా వరుసగా నటిస్తూ వస్తుంది. ఈమె నటించిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించడంతో ఈమెకు ఇండియా వ్యాప్తంగా ప్రస్తుతం సూపర్ సాలిడ్ క్రేజ్ ఉంది. తాజాగా ఈ నటికి ఓ భారీ క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాలలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో ఓ కీలకమైన పాత్రలో రష్మిక కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ లో రష్మిక పాత్రకు సంబంధించిన కథను ప్రశాంత్ ఈమెకు వినిపించగా ఈమెకు ఆ పాత్ర నచ్చడంతో వెంటనే ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లోనే వెలువడనునట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ నటి వరుస పెట్టి హిందీ సినిమాలలో నటిస్తోంది. ఇప్పటికే ఈమె నటించిన హిందీ సినిమాలలో చావా మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దానితో ఈమెకు హిందీ సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rm