టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నవీన్ చంద్ర క్రైమ్ థ్రిల్లర్ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నారు. నవీన్ చంద్ర హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన లెవన్ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ అజిల్స్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది.
 
కథ :
 
విశాఖలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న అరవింద్ (నవీన్ చంద్ర) స్మార్ట్ పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకుంటారు. అయితే విశాఖ నగరంలో వరుస హత్యలు చోటు చేసుకోగా ఆ కేసులను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న రంజిత్ (శశాంక్) రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. ఆ కేసు బాధ్యతలను అరవింద్ తీసుకోగా హంతకుడు కానీ హత్యకు గురైన ఆనవళ్లు కానీ దొరకవు.
 
ఈ హత్యలను ఒక సైకో చేస్తున్నాడని పోలీసులు భావించగా ఆ సైకోను అరవింద్ ఎలా పట్టుకున్నాడు? చివరకు ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
 
విశ్లేషణ :
 
క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ప్రధానంగా కథ, కథనం అద్భుతంగా ఉండటంతో పాటు ఊహించని మలుపులు ఉండాలి. ఆ ప్రత్యేకతలు ఉండటం వల్ల లెవన్ మూవీ ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు అస్సలు బోరు కొట్టదు. హృదయన్ని హత్తుకునే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాకు హైలెట్ అయింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉండగా ఇంటర్వెల్ కు ముందు వచ్చే సన్నివేశాలు బాగున్నాయి.
 
నవీన్ చంద్ర పోలీస్ ఆఫీసర్ రోల్ లో అద్భుతంగా నటించారు. క్లైమాక్స్ లో నవీన్ చంద్ర నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంది. హీరోయిన్ రియా హరి తన పాత్ర పరిధి మేర మెప్పించారు. హీరోయిన్ అభిరామికి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కగా తమిళంలో కూడా ఈ సినిమా హిట్టయ్యే అవకాశాలు ఉన్నాయి.
 
బలాలు : కథ, కథనంలో మలుపులు, నవీన్ చంద్ర పాత్ర, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు
 
బలహీనతలు : ఫస్ట్ హాఫ్ లో కొన్ని బోరింగ్ సీన్స్
 
రేటింగ్ : 3.0/5.0
 


మరింత సమాచారం తెలుసుకోండి: