యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తనను నమ్మిన వాళ్లకు అండగా ఉండే విషయంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. ఎన్నో హిట్ సినిమాలలో నటించిన తారక్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండగ రోజు అనే సంగతి తెలిసిందే. అయితే కొన్నేళ్ల క్రితం వరకు తారక్ సినిమాలు విడుదలైతే మెసేజ్ ల ద్వారా జోరుగా నెగిటివ్ ప్రచారం జరిగేది.
 
జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా బాగున్నా బాలేకపోయినా నెగిటివ్ ప్రచారం మాత్రం ఆగేది కాదు. మార్నింగ్ షో కూడా పూర్తి కాకముందే సినిమా ఫ్లాప్ అంటూ జోరుగా ప్రచారం చేసేవారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి కావాలని ఈ తరహా ప్రచారం చేసేవారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన వాళ్లు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా పని చేశారని ఆ సమయంలో వార్తలు వచ్చాయి.
 
వాళ్లు జూనియర్ ఎన్టీఆర్ ను కావాలనే టార్గెట్ చేయడం ద్వారా తారక్ కు నష్టం కలిగేలా చేశారు. ఒకానొక దశలో తారక్ ఖాతాలో వరుసగా ఫ్లాపులు చేరడానికి సైతం ఇదే కారణమని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపించాయి. అయితే ఎన్ని కష్టాలు ఎదురైనా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అంతకంతకూ ఎదిగి ఈరోజు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.
 
అయితే టెంపర్ సినిమా తర్వాత మాత్రం తారక్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో భారీ విజయాలతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సత్తా చాటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు టాలెంట్ కు తగిన గుర్తింపు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త సినిమాలతో మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అభిమానులను సైతం ఎంతో అభిమానించే ప్రేమగా వ్యవహరించే హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: