ఇటీవలే చిన్న సినిమాగా విడుదలైన కోర్ట్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి నిర్మాతగా హీరో నాని వ్యవహరించగా.. అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కీలకమైన పాత్రలో శివాజీ, ప్రియదర్శి, సాయికుమార్ తదితర నటీనటులు నటించారు.ఇందులో హీరోయిన్గా నటించిన శ్రీదేవి తన నటనతో బాగానే ఆకట్టుకుంది. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో పలు రకాల రీల్స్ వల్ల బారి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి కొంతమేరకు ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. అలా పలు రకాల షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి, సినిమా ఈవెంట్లకి, టీవీ ప్రోగ్రామ్స్ కు కూడా గెస్ట్ గా వస్తూ ఉన్నది.




ఇటీవలే జీ తెలుగు ఇస్తున్నటువంటి జి అప్సర అవార్డుని ప్రకటించగా ఇందులో కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవికి అవార్డు గెలుచుకున్నట్లుగా ఒక ప్రోమో ని చూపించారు. తాజాగా ఈ ప్రోమో వైరల్ గా మారుతున్నది. ఈ ప్రోమో విషయానికి వస్తే శ్రీదేవి అవార్డు అందుకున్న తర్వాత మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం వెనుక తన తల్లి ఉందని తన తల్లి సింగిల్ పేరెంటు అని చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొందంటూ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఒక్కసారిగా ఏడ్చేసింది శ్రీదేవి.. మా అక్కను నన్ను ఒక సింగిల్ పేరెంటుగా చాలా కష్టపడి తన తల్లి  పెంచడంతోనే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటూ తెలియజేసింది.


అంతేకాకుండా తన తల్లిని స్టేజి మీదకి ఆహ్వానించి తన కన్నీటితో అమ్మకాలను కూడా పట్టుకొని ఎమోషనల్ అయ్యింది శ్రీదేవి. అయితే ఈ ప్రోమో చూసిన పలువురు అభిమానులు ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు. మరి శ్రీదేవికి రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలలో నటించాలని అభిమానులైతే కోరుకుంటున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి ఎపిసోడ్ మే 24వ తేదీన జీ తెలుగులో ప్రసారం కాబోతున్నది. మరి రాబోయే రోజుల్లో కోర్ట్ చిత్రానికి ఏ అవార్డులు వస్తాయి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: