- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో ఎవరు ఏమైపోయినా ... టాలీవుడ్ పూర్తిగా గాడి తప్పిన థియేటర్లో మూసుకున్నా ... సింగిల్ స్క్రీన్లు పూర్తిగా మూతపడుతున్న సినిమా రంగం ఎంత సంక్షోభంలోకి వెళ్లినా నిర్మాతలకు లాభాలు రాకపోయినా ... ఎగ్జిబిటర్లు , డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోతున్న మన టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం రెమ్యూనరేషన్ తగ్గించుకోని పరిస్థితి నెలకొంది. తమ సినిమాలు వరుస పెట్టి ప్లాపులు అవుతున్నా .. డిజాస్టర్లు అవుతున్నా .. సినిమా కొన్న వాళ్ళు గుల్ల గుల్ల అయిపోతున్నా .. ఆస్తులు అమ్ముకుంటున్నా .. పెద్ద పెద్ద బ్యానర్లు సైతం దుకాణం సర్దుకోవాల్సిన పరిస్థితులు వచ్చినా కూడా మన హీరోలు మాత్రం ఒక్క పైసా కూడా రెమ్యున‌రేషన్ తగ్గించుకోం అంటున్న పరిస్థితి కనిపిస్తోంది.


వరుస ప్లాపులు అవుతున్న హీరోలు కూడా సినిమా సినిమాకు రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతున్న పరిస్థితి. మన సినిమా హీరోలకు కావలసింది కేవలం డబ్బు మాత్రమే. తమతో సినిమాలు తీసిన నిర్మాతలు .. డిస్ట్రిబ్యూటర్లు .. ఎగ్జిబిటర్లు ఎవరు ఎలా మునిగిపోయినా .. ఎంత దారుణంగా నష్టపోయిన తమ సినిమా ఎన్నో కుటుంబాలను రోడ్డు మీదకు లాగేసినా కూడా మన హీరోలకు అస్సలు ఏమాత్రం పట్టడం లేదు. వారు మాత్రం ప్రేక్షకులు ఇచ్చే డబ్బులతో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తూ సినిమా కళామతల్లి ఇచ్చిన క్రేజ్ తో స్టార్ స్టేటస్ అనుభవిస్తూ అదే సినిమా కళామతల్లిని నిలువునా చంపేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. హీరోల ధ‌న దాహానికి తోడు .. కొంద‌రు స్టార్ హీరోలు రెండు .. మూడేళ్ల‌కు సినిమాలు చేయ‌డం .. పాన్ ఇండియా మోజులో ప‌డ‌డం .. రెండు .. మూడేళ్ల‌కు ఒక సినిమా తీస్తుండ‌డంతో ఇటు థియేట‌ర్ల‌కు ఫీడింగ్ లేక .. అటు సినిమాల‌కు భారీ రేట్లు పెట్టి కొన‌లేక‌... ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రాక టాలీవుడ్ సంక్షోభంలోకి నెట్టి వేయ‌బ‌డుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: