
వెండి తెరపై కొత్త అందాలకి టాలెంట్ కి ఉన్నంత క్రేజ్ సీనియర్లకు ఉండదనే మాట ఇప్పుడు పక్కకు వెళ్ళిపోయింది .. కోలీవుడ్ లో ఆ ఇద్దరిని చూసినవారు మాత్రం వాళ్లు పేరుకే సీనియర్లు వాళ్లకు ఉన్న క్రేజ్‌తో పోలిస్తే జూనియర్లు అసలు దరిదాపుల్లో కూడా ఉండలేకపోతున్నారని మాట్లాడుకుంటున్నారు .. ఇంతకీ వారు ఎవరో మీకే ఒక అవగాహన వచ్చేసినట్టు ఉంటుంది .. ఒకటా రెండా బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది త్రిష .. మొన్నటికి మని ఒకేసారి రెండు రిలీజ్లు చూశారు .. అజిత్ తో విడాముయర్చి హిట్ కాకపోయినా గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం గట్టిగా హిట్ ఇచ్చింది .
ఇక ఇప్పుడు థగ్‌లైఫ్ లో షుగర్ బేబీ అంటూ హస్కీగా మారిపోయి మరి ఈ బ్యూటీ కమలహాసన్ తో జోడి కడుతూ మణిరత్నంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు త్రిష . అలాగే సేమ్ టు సేమ్ నయనతార విషయం లోను ఇదే జోష్ కనిపిస్తుంది .. సంక్రాంతికి రఫ్ ఆడించేద్దాం అంటూ రీసెంట్గా అనిల్ రావిపూడి తో కలిసి తెలుగులో మాట్లాడుతూ గట్టిగా హల్చల్ చేశారు నయనతార . ఒకవైపు కోలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా కంటెంట్ డ్రైవ్ చేసే ప్రాజెక్టులో ఛాన్స్ వస్తే స్టార్ హీరోల సినిమాల తో బిజీబిజీగా కనిపిస్తున్నారు నయనతార .. అలాగే సినిమాలో తన రోల్స్ కి తగ్గట్టు తన్ను తాను మార్చుకుంటూ దూసుకుపోతున్నారు .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు