లోక నాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన చాలా సంవత్సరాల క్రితం నటుడిగా కెరియర్ను మొదలు పెట్టి , ఎన్నో సినిమాల్లో నటించి , ఎన్నో విజయాలను అందుకుని ఇండియా వ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. కమల్ నటుడిగా కంటిన్యూ అవుతున్న సమయం లోనే రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే చాలా సంవత్సరాల పాటు వరస పెట్టి అపజయాలను అందుకున్న కమల్ కొంత కాలం క్రితం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ అనే సినిమాలో హీరో గా నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

మూవీ తర్వాత కమల్ , శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు 2 అనే మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ అయింది. కమల్ తాజాగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన థగ్ లైఫ్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని జూన్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కమల్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

అందులో భాగంగా తను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి గల కారణాలను కూడా చెప్పుకొచ్చాడు. తాజాగా కమల్ హాసన్ మాట్లాడుతూ ... నేను ముఖ్యమంత్రిని కాపడానికి రాజకీయాల్లోకి రాలేదు. తమిళనాడు ప్రజలకు ఎంతో గొప్ప స్థాయిలో సేవలు చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను. నిదానంగా నేను అనుకున్నది సాధిస్తాను అని తాజాగా కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతానికి థగ్ లైఫ్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: