కన్నప్ప సినిమాకు సంబంధించి తాజాగా ఒక సంచలన వార్త వెలుగు లోకి వచ్చింది. అదేంటంటే.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ ని ఆఫీస్ బాయ్ రఘు దొంగలించారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ హార్డ్ డిస్క్ లో కన్నప్ప మూవీలో ని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ముంబైలోని హెచ్ఐఈవి స్టూడియోస్ వాళ్ళు విఎఫ్ఎక్స్ డిజైన్ చేసి ముంబై నుండి కొరియర్ ద్వారా హైదరాబాదులోని 24 ఫ్రేమ్స్ ఆఫీస్ కి పంపించారట.అయితే అదే సమయంలో అక్కడే ఉన్న ఆఫీస్ బాయ్ ఆ కొరియర్ లో వచ్చిన హార్డ్ డిస్క్ ని దొంగతనం చేసి పారిపోయారట. దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. 

అయితే ఇప్పటివరకు ఏ విషయాలు బయటికి తెలియక పోయినప్పటికీ తాజాగా టాలీవుడ్ సినీ వర్గాల్లో ఒక సంచలన విషయం బయటపడింది. అదేంటంటే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప హార్డ్ డిస్క్ ని దొంగతనం చేయించింది మంచు మనోజే అని, అన్నదమ్ముల మధ్య వ్యక్తిగత కక్ష్యలు ఉండడంతో మంచు మనోజ్ స్వయంగా తన సహాయకులైనటువంటి చరిత, రఘు  ల సహాయంతో ఈ హార్డ్ డిస్క్ ని దొంగతనం చేయించాడంటూ మంచు విష్ణు వర్గం ఆరోపిస్తోంది. అంతేకాదు ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి వీడియో క్లిప్స్ అన్నింటిని ఆన్లైన్లో లీక్ చేసి కన్నప్ప మూవిని దెబ్బతీయాలని చూస్తున్నారట మంచు మనోజ్.

అయితే మొదట ఈ హార్డ్ డిస్క్ ని ఆన్లైన్లో లీక్ చేస్తామని బెదిరింపులకు గురి చేసి ఆ తర్వాత మంచు విష్ణు వాళ్లు పెట్టిన కండిషన్లు వినకపోతే ఆ సీన్స్ అన్ని ఆన్లైన్లో లీక్ చేసి కన్నప్ప మూవీ పై దెబ్బ కొట్టాలని మంచు మనోజ్ చూస్తున్నారని అందుకే తన సహాయకుడైనటువంటి రఘు చరితతో కలిసి ఈ దొంగ పని చేయించారని తెలుస్తోంది. అయితే మంచు మనోజే ఈ దొంగతనం చేయించాడని క్లారిటీగా తెలియకపోయినప్పటికీ మంచు విష్ణు వర్గం మాత్రం ఈ పని చేసింది మంచు మనోజే అంటూ ఒక వార్త వైరల్ చేస్తున్నారు.మరి దీనిపై మంచి విష్ణు గానీ మంచు మనోజ్ గాని ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: