పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండి ఆయన చేసే సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఇక ఆయన ఒప్పుకున్న సినిమాలలో హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకి సిద్ధంగా ఉన్నప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ఈ రెండు సినిమాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఇక ఇందులో ఓజీ సినిమా చూసుకుంటే రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. సుజీత్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ఈ సినిమా ఈ ఏడాది అనగా 2025 సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. దీంతో పవర్ స్టార్ అభిమానుల్లో కొత్త సందడి నెలకొంది. ఈ సినిమా కోసం ఎంతోమంది అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ వైపు హరిహర వీరమల్లు మూవీ వచ్చే నెల అనగా జూన్ 12న విడుదల కాబోతుంది. 

మళ్లీ మూడు నెలల వ్యవధిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మరో సినిమా అంటే పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అలా సెప్టెంబర్ 25న విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ ఓజి మూవీ గురించి తాజాగా టాలీవుడ్ సినీ వర్గాల్లో ఒక షాకింగ్ వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ మూవీలో ఓ కీలక పాత్రలో చంద్రబాబు నాయుడు కోడలు నటిస్తుందట. మరి ఇంతకీ ఓజి సినిమాలో చంద్రబాబు నాయుడు కోడలు నటిస్తున్న ఆ పాత్ర ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు నాయుడు కోడలు అనగానే అందరికీ బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి అనే గుర్తుకొస్తుంది. కానీ అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే ఓజీ మూవీలో నటించేది చంద్రబాబు సొంత కోడలు బ్రాహ్మణి కాదు.

చంద్రబాబు నాయుడు తమ్ముడికి కాబోయే కోడలు నటి సిరి లేళ్ళ.. చంద్రబాబు నాయుడు సోదరుడి కొడుకు నారా రోహిత్ నటించిన ప్రతినిధి-2 మూవీలో హీరోయిన్ గా సిరి లేళ్ల నటించింది. ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ అప్పటినుండి డేటింగ్ చేయసాగారు. అలా రీసెంట్ గానే వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.కానీ ఇంతలోనే నారా రోహిత్ తండ్రి మరణించడంతో ఈ పెళ్లి వాయిదా పడింది. అయితే సిరిలేళ్ల ప్రతినిధి 2 మూవీ తర్వాత మరో సినిమాలో చేయలేదు. ఇక తాజాగా సినీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో సిరి లేళ్ల ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ అఫీషియల్ గా స్పందించలేదు. మరి దీనిపై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: