బాలీవుడ్ అందాల తార ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది హిందీతో పాటు ఇతర భాషల్లో అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. హిందీలో మాత్రమే కాకుండా తెలుగులోనూ ఆలియా సినిమాలలో నటించింది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా చేసింది.

ఇక ఆలియా భట్ వ్యక్తిగత విషయానికి వస్తే తాను సినిమాలలో నటిస్తున్న సమయంలోనే కపూర్ కుటుంబానికి చెందిన హీరో రణబీర్ కపూర్ తో ప్రేమలో పడింది. వీరిద్దరూ చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకున్న అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహాన్ని చేసుకుంటారు. 2022 ఏప్రిల్ 14న ఆలియా భట్, రణబీర్ కపూర్ ల వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. వివాహం అయినప్పటికీ ఆలియా ఎప్పటిలాగే సినిమాలు చేస్తోంది. తాజాగా ఆలియా భట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

అందులో మాట్లాడుతూ తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తన అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే ఆలియా తన ఫేవరెట్ హీరో ఎవరనే  విషయాన్నీ వెల్లడించారు. తన ఫేవరెట్ హీరో ఫహాద్ ఫాజిల్ అని చెప్పింది. అతని సినిమాలు బాగా చూస్తానని వెల్లడించింది. ఫహాద్ ఫాజిల్ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ అని మనసులో మాట చెప్పింది. అతనితో కలిసి నటించే అవకాశం వస్తే... అస్సలు వదులుకోనని వెల్లడించింది. ఏదో ఒక రోజు ఫహాద్ ఫాజిల్ సినిమాలో నటించే అవకాశం వస్తుందని ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తన మనసులో కోరికను బయట పెట్టింది. ఆ సినిమాలో తనతో రొమాంటిక్ సన్నివేశాలలో కలిసి నటించే అవకాశం వచ్చిన వదులుకోనని చెప్పింది. ప్రస్తుతం ఆలియా భట్ చేసిన ఈ కామెంట్లు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: