నేడు సీనియర్ ఎన్టీఆర్ 102 వ జయంతి. ఎన్టీఆర్ సినిమాల ద్వారా విపరీతంగా అభిమానులను సంపాదించుకున్నాడు. రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎల్లప్పుడూ ప్రజల గురించి ఆలోచనలు చేసేవారు. ఎన్టీఆర్ ప్రజల కోసం అనేక రకాల పథకాలను అమలులోకి తీసుకొచ్చారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన పథకాల గురించి తెలుసుకుందాం...

రెండు రూపాయలకు కిలో బియ్యం

ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలలో చాలా ముఖ్యమైనది రెండు రూపాయలకే కిలో బియ్యం. ఇప్పటికి ఈ పథకం అమలులో ఉండడం విశేషం. ప్రతి ఒక్క పేదవాడు కడుపునిండా మూడు పూటల అన్నం తినాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఈ పథకాన్ని తీసుకువచ్చి చరిత్ర సృష్టించారు.

జనతా వస్త్రాల పంపిణీ

ఎన్టీఆర్ జనతా వస్త్రాల పంపిణీ పథకం పేరుతో ప్రతి ఒక్క పేదవాడికి కనీస అవసరాలు అయిన వస్త్రాలను అందించారు. పేద ప్రజలు దుస్తులు కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటివారికి ఎన్టీఆర్ ఈ పథకాన్ని తీసుకువచ్చి తన వంతు సహాయం చేశాడు.

ఐదు లక్షల ఇండ్ల నిర్మాణం

ఎన్టీఆర్ తన ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఐదు లక్షల ఇళ్లను నిర్మించాడు. ఇల్లు లేని పేదలకు ఎంతోమందికి గూడును కల్పించాడు. బలహీనవర్గాలకు లక్షలాది సంఖ్యలో ఇండ్లను కట్టించి ఒక నివాస స్థలాన్ని ఏర్పరిచారు. అగ్రకుల పెత్తందారులకు కొమ్ముకాసే పటేల్ పట్వారి వ్యవస్థను రద్దుచేసి సంచలనం లేపారు.

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఎన్టీఆర్ ప్రారంభంచాడు. చదువుపై దృష్టి పెట్టేలా పేద విద్యార్థులను చదువు వైపు ప్రోత్సాహించే దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్టీఆర్ మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటికీ ఈ పథకం తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతుండడం గమనార్హం. ఎన్టీఆర్ తన పరిపాలన కాలంలో ఇంకా అనేక రకమైన పథకాలను తీసుకువచ్చారు. గొప్ప రాజకీయ నాయకుడిగా మంచి పేరును సొంతం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: