సినీ ఇండస్ట్రీ అంటేనే ప్రేమ పెళ్లిళ్లు, బ్రేకప్ వంటివి నిత్యం ఏదో ఒక విషయంలో వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కూడా విడాకులు బాట పట్టారు.. కానీ ఇప్పుడు తాజాగా ఒక హీరోయిన్ కి సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది.. ముఖ్యంగా ఆ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మూడు వివాహాలు చేసిందని ఇక ఆమె తండ్రి అయితే ఏకంగా 5 వివాహాలు చేసుకున్నారనే విధంగా వినిపిస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


టాలీవుడ్, కోలీవుడ్ లో అలనాటి సీనియర్ హీరోయిన్గా పేరు పొందిన రాధిక గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్గా నటించి మంచి విజయాలను అందుకుంది. రాధిక పలు రకాల సీరియల్స్లలో కూడా అమ్మ పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ మధ్యకాలంలో సినిమాలలో కూడా కీలకమైన పాత్రలలో నటిస్తోంది రాధిక. రాధిక శరత్ కుమార్ తండ్రి ఎంఆర్ రాధ. ఈయన తమిళంలో కూడా భారీ క్రేజ్ ఉన్న నటుడు ఈయన ఐదు పెళ్లిళ్లు చేసుకున్నారని.. అందులో ప్రేమావతి, సరస్వతి, ధనలక్ష్మి, జయమ్మ లను వివాహం చేసుకున్నారట.


అయితే వీరందరినీ కూడా వదిలిపెట్టి చివరికి శ్రీలంకకు చెందిన గీతను వివాహం చేసుకున్నారట ఎంఆర్ రాధ. మొత్తం ఈయనకు 12 మంది సంతానం. అలా శ్రీలంక మహిళకు జన్మించిన రాధికా హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. రాధికా కు ఒక చెల్లెలు కూడా ఉన్నది ఆమె పేరు నిరోషా.. రాధిక పెళ్లిళ్ల విషయానికి వస్తే ముందు నటుడు ప్రతాప్ పోతేన్ ను పెళ్లి చేసుకోక కొన్ని కారణాల చేత విడిపోయారు.. ఆ తర్వాత రిచర్డ్ హార్డ్ ని వివాహం చేసుకోగ కొన్ని నెలలకి ఈ బంధం ముగిసింది. ప్రస్తుతం అయితే నటుడు శరత్ కుమార్ ను పెళ్లి చేసుకుంది రాధిక.

మరింత సమాచారం తెలుసుకోండి: