- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు .. రిలీజ్ కు రెడీ అవుతుంది .. ఇక నిధి అగర్వాల్సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది .. జూన్ 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ వారం చివరి నుంచి ఈ మూవీ ప్రమోషన్ లో పాల్గొంటారని .. కాకపోతే రెగ్యులర్ ప్రమోషన్స్ లా కాకుండా సినిమా గురించి పవన్ చేత ప్రత్యేక ఇంటర్వ్యూలను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది .. అలాగే ఈ వారం ముందు నుంచే ఈ సినిమా ప్రమోషన్స్ ను మరింత దూకుడుగా మొదలు పెట్టాలని మేకర్స్ గట్టి ప్లాన్ చేస్తున్నారు ..  అదే విధంగా దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం లో ఈ సినిమా రానుంది ..


సినిమా లో నిధి అగర్వాల్ తో పాటు బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు .. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు .. మరో అగ్ర‌ దర్శకుడు క్రిష్ కూడా ఈ సినిమా లో పలు కీలక సన్నివేశాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే .. సినిమా షూటింగ్ లేట్ అవ్వడం క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకుని .. ఆ బాధ్యతలు జ్యోతి కృష్ణకు అప్పగించాడు .. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ టైం దగ్గర పడటం తో .. పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయి .. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ వెండితెరపై చూడబోతున్నామని  ఆనందంలో పవర్ స్టార్ అభిమానులు మునిగిపోయారు . ఇక మరి హరిహర వీరమల్లు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: