
డైరెక్టర్ యుగంధర్ ముని డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ పూర్తి డిఫరెంట్ అవతారంలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు తనని చూడని లుక్ లో యాక్షన్ సన్నివేశాలతో కనిపించబోతున్నారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. ఈ విశ్వంలో అంతు పట్టని రహస్యాలు ఎన్నో ఉన్నాయనే వాయిస్ తో మొదలవుతుంది.. ఇక టీజర్ లో చూపించిన విజువల్స్ కూడా సరికొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయేలా ఉన్నది. ఈ టీజర్ లో చూపించిన వాతావరణం కూడా బాగా ఆకట్టుకునేలా ఉన్నది.
ఇక స్టోరీ విషయానికి వస్తే ఈ కథలు ఊరి మీద ఒక ఉల్క రూపంలో ఒక ఆకారం పడుతుంది.. అయితే అది పడినప్పటినుంచి ప్రజలు మరణిస్తూ ఉంటారు మరి కొంతమంది మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు.. వీటన్నిటిని కాపాడడానికి హీరో చేసే ప్రయత్నం ఏంటి అన్నట్లుగా చూపించారు. ఇది కేవలం హర్రరే కాకుండా సైంటిఫిక్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఆది సాయికుమార్ కూడా పోలీస్ పాత్రలో మరొకసారి కనిపించబోతున్నారు. ఇప్పుడు మిస్టారికల్ చిత్రంతో రాబోతున్న శంబాల సినిమా తోనైనా సక్సెస్ అందుకోవాలని అభిమానులైతే కోరుకుంటున్నారు. మరి టీజర్ తో స్పందన అయితే బాగానే వస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే అన్ని అప్డేట్స్ రాబోతున్నాయి.