అక్కినేని నాగార్జున నట వారసులలో ఒకరు అయినటువంటి అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన అఖిల్ అనే మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత అఖిల్ అనేక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అఖిల్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో తప్పిస్తే వేరే ఏ మూవీ తో కూడా మంచి విజయం దక్కలేదు. ఆఖరిగా అఖిల్ "ఏజెంట్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది.

ఇకపోతే ఏజెంట్ మూవీ తర్వాత కాస్త ఎక్కువ కాలం గ్యాప్ తీసుకొని కొంత కాలం క్రితమే అఖిల్ "లెనిన్" అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుండగా ... మురళీ కిషోర్ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ , సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ పెట్టాలి అనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఓ అద్భుతమైన క్రేజ్ కలిగిన నటిని ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్లో నటింపజేయాలి అని ఈ మూవీ బృందం ప్రస్తుతం అనుకుంటున్నట్లు , అందులో భాగంగా ఒక మంచి క్రేజ్ ఉన్న నటిని ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం సెలెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ మూవీ లోని స్పెషల్ సాంగ్ మాస్ ఆడియన్స్ ను అద్భుతంగా ఆకట్టుకునే విధంగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మరి ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ మాస్ ఆడియన్స్ ను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నట్లయితే ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: