మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆఖరుగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన తర్వాత త్రివిక్రమ్ తన తదుపరి మూవీ ని అల్లు అర్జున్ తో చేయబోతున్నాడు. ఇప్పటికే బన్నీ కోసం అల్లు అర్జున్ అద్భుతమైన కథను రెడీ చేస్తున్నాడు. పుష్ప పార్ట్ 2 సినిమా పూర్తి కాగానే బన్నీ , త్రివిక్రమ్ కాంబో లో మూవీ స్టార్ట్ అవుతుంది అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇకపోతే పుష్ప పార్ట్ 2 విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది.

ఆ తర్వాత బన్నీ , అట్లీతో సినిమా సెట్ చేసుకున్నాడు. మరి త్రివిక్రమ్ , బన్నీ కాంబో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానిపై క్లారిటీ లేదు. దానితో త్రివిక్రమ్ , వెంకటేష్ తో సినిమా చేయడానికి ప్రస్తుతానికి కమిట్ అయ్యాడు అని , ఆ మూవీ తర్వాత బన్నీ తో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి అని మొదట వార్తలు వచ్చాయి. ఇక ప్రస్తుతం మాత్రం త్రివిక్రమ్ ఏకంగా తన తదుపరి మూడు మూవీలను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ అందులో అల్లు అర్జున్ తో సినిమా మాత్రం లేదు అని వార్తలు వస్తున్నాయి.

అసలు విషయం లోకి వెళితే ... త్రివిక్రమ్ తన తదుపరి మూవీ ని విక్టరీ వెంకటేష్ తో చేయబోతున్నట్లు , ఆ మూవీ పూర్తి కాగానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మరో సినిమా చేయనున్నట్లు , ఆ మూవీ పూర్తి కాగానే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో మరో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు మూవీ ల తర్వాత కూడా అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందా ..? లేదా అనే దానిపై పెద్దగా క్లారిటీ లేనట్లు తెలుస్తోంది. మరి మొదట త్రివిక్రమ్ , అల్లు అర్జున్ కాంబోలో మూవీ ఉంటుంది అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ నెక్స్ట్ మూడు మూవీ లలో కూడా బన్నీ తో సినిమా లేదు అని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: