టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొంత కాలం క్రితం విడుదల అయ్యి అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతుంది. దానితో అఖండ 2 మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది.

ఇకపోతే ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ టీజర్ కు విడుదల 24 గంటల్లో 22.33 మిలియన్ వ్యూస్ ... 531.5 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

ఇకపోతే ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. అఖండ మూవీ కి కూడా తమన్ సంగీతం అందించాడు. ఆ మూవీ మ్యూజిక్ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. దానితో అఖండ 2 మూవీ మ్యూజిక్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదల అయిన అఖండ 2 టీజర్ కు కూడా తమన్ అందించిన సంగీతం అదిరిపోయే రేంజ్ లో ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nbk