టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి రామ్ పోతినేని ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న మంచి విజయాలను అందుకోవడంలో చాలా వరకు వెనకబడిపోయాడు. ఆఖరుగా ఈయన నటించిన ది వారియర్ , స్కంద , డబల్ ఈస్మార్ట్ మూడు సినిమాలు కూడా మంచి అంచనాల నడమ థియేటర్లలో విడుదల అయిన ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యాయి. ప్రస్తుతం రామ్ , మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ లో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... కన్నడ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ఉపేంద్రమూవీ లో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లో ఉపేంద్ర కు భార్య పాత్రలో సింధు తులాని నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కోసం రామ్ సరికొత్త రీతిలో పారితోషకం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ... ఈ మూవీ కోసం రామ్ మొదట 10 కోట్ల పారితోషకం మాత్రమే తీసుకోనున్నట్లు , ఆ తర్వాత సినిమాకు గనక లాభాలు వచ్చినట్లయితే ఆ లాభాల్లో వాటా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇలా రామ్ మొదట నిర్మాతలపై పెద్దగా భారం పడకుండ 10 కోట్లు మాత్రమే తీసుకొని ఆ తర్వాత సినిమా బాగుండి నిర్మాతకు లాభాలు వస్తే ఆ లాభాల నుండి మాత్రమే పారితోషకం తీసుకొనున్నట్లు తెలియడంతో ఈ సినిమా మంచి లాభాలు తెచ్చుకొని రామ్ కి కూడా మంచి పారితోషకం అందినట్లయితే అనేక మంది హీరోలు ఈయన రూట్ ను ఫాలో అవుతారు అనే అభిప్రాయాలను కూడా చాలా మంది వ్యక్త పరుస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: