బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్  ఇటీవల  ఓటీటీ సంస్థలు అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ మాట్లాడారు .. అదే విధంగా సినిమాలు రిలీజ్ అయ్యాక తక్కువ సమయం లో ఓటీటీలోకి తీసుకు వస్తే థియేటర్లు నష్టపోతాయని .. అలాగే ఇది ఏమాత్రం మంచి విషయం కాదని ఆయన ఓపెన్ గా చెప్పేస్తున్నారు .. ఇక దీంతో ఇప్పుడు అందరి చూపులు ఆయన సొంత బ్యానర్ నుంచి వస్తున్న ‘సితారే జమీన్ పర్’ సినిమా పై పడ్డాయి .. ఫీల్ గుడ్ కంటెంట్ గా ఈ సినిమా ను ఆయన ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు ... ప్రతి ఆర్ఎస్.ప్రసన్న డైరెక్టు చేసిన ఈ సినిమా ని అమీర్ ఖాన్ సొంతంగా నిర్మించారు ..
 

అలాగే ఈ సినిమా లో ఆయన  కూడా నటించడం తో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి .. గతంలో వచ్చిన తారే జమీన్ పర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత అలాంటి కథ తోనే ఈ సినిమా ను కూడా తీసుకువస్తున్నారు .. అయితే ఈ సినిమా కు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను అమీర్ ఖాన్ ఎవరికీ అమ్మ లేదు . సినిమా థియేటర్ రన్ పూర్తయ్యాక తానే స్వయంగా యూట్యూబ్‌లో పే ఫర్ వ్యూ పద్ధతి లో ఈ సినిమా ని రిలీజ్ చేస్తానని అమీర్ ప్రకటించారు .. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయితే కానీ ఏదైనా తేడా కొడితే ఈ సినిమా ని యూట్యూబ్లో డబ్బులు పెట్టి ఎవరైనా ఎందుకు చూస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు .. ఇక మరి ఈ విషయం లో అమీర్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి .



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: