చిత్ర పరిశ్రమ అంటేనే ఓ రంగుల ప్రపంచం .. ఈ రంగుల ప్రపంచంలో హీరోయిన్ల స్క్రీన్ ప్రజెన్సే కాదు .. కెరీర్ స్పాన్ కూడా చాలా తక్కువ .. పెళ్లయి పిల్లలు ఉండాల్సిన అవసరం లేదు .. జస్ట్ 35 దాటితే .. నటనకు గుడ్ బై చెప్పాల్సిందే . లేకపోతే మదర్ , సిస్టర్ , వదిన క్యారెక్టర్ లకు షిఫ్ట్ చేస్తూ ఉంటారు .. అయితే అది ఒకప్పటి ముచ్చట .. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది .. 35 కాదు 45 ప్లస్ లో కూడా సీనియర్ హీరోయిన్లు లీడ్ య‌క్టర్లుగా మారి అదరగొడుతున్నారు .. అయితే ఈ ధోరణికి ఊపిరి పోసింది మాత్రం బాలీవుడ్ .


చిత్ర పరిశ్రమలో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరియర్ కొన్ని సంవత్సరాలు మాత్రమే .. అది కూడా బాగా క్లిక్ అయితేనే వరుస విజయాలు కొట్టి లక్కీ లేడీ గోల్డెన్ లెగ్ ని పేరు తెచ్చుకుంటేనే కొన్ని సంవత్సరాలు రాణించగలరు .. లేకపోతే గుడ్ బై చెప్పాల్సిందే .. బాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు ఇదే తీరు కనిపిస్తుంది .. అయితే అది ఒకప్పటి తీరు .. ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది .. ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీలో .. ఎంగేజ్ లోనే కాదు 45 ప్లస్ లోను హీరోయిన్లుగా మారి అదరగొడుతున్నారు .. విద్యాబాలన్ , టబూ , కాజోల్ , ఐశ్వర్యరాయ్ , రాణి ముఖర్జీ , చిత్రాంగదా సింగి లాంటి సీనియర్  భామలు .. ఫిమేల్ లీడ్ యాక్టర్లుగా డిమాండ్ ఉండడంతో రెమ్యునరేషన్స్ కూడా భారీగానే అందుకుంటున్నారు ..


కాజోల్ ఈ రీసెంట్ టైమ్స్ లో సెలెక్ట్ స్టోరీలతో అదరగొడుతుంది .. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ సలామ్ వెంకీ, లస్ట్ స్టోరీస్2, దో పట్టీ, ‘మా’ చిత్రాలు ... ఇవి డిఫరెంట్ జోనర్స్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మూవీస్ .. ఓటీటీ , థియేటర్ ఏదైనా అమితమైన ఫ్యాన్ బేస్ ఆమె సొంతం .. అలాగే విద్యాబాలన్ కెరీర్‌ మొదటి నుంచి తన క్యారెక్టర్ కు వెయిటేజ్ ఉంటేనే సినిమాలు చేస్తూ వస్తుంది .. నిజానికి బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఊపిరిపోసింది విద్యాబాలనే .  అలాగే టబు 50 ప్లస్ ఏజ్ లో కూడా సౌత్ , నార్త్‌ అనే తేడా లేకుండా అదరగొడుతుంది .. ఇప్పటికీ ఈమెకు భారీ డిమాండ్ ఉండటం విశేషం .

మరింత సమాచారం తెలుసుకోండి: