
అయితే ఈ ఎడిటింగ్ చూసిన చాలా మంది నెటిజన్స్ కూడా నవ్వుకుంటున్నారు.. ముఖ్యంగా ఖలేజా సినిమాలోని అనుష్క, మహేష్ బాబు మధ్య వచ్చే సన్నివేశాలు సునీల్ కామెడీ సన్నివేశాలను కూడా ఇందులో చూపించి చాలా హైలెట్ చేశారు. rrr సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఖలేజా సినిమాకి సంబంధించి సన్నివేశాలను సైతం మిక్స్డ్ చేసి మరి చూపించారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ మాత్రం కడుపుబ్బ నవ్వుకునేలా కనిపిస్తూ ఉన్నారు.
ఎన్టీఆర్, రామ్ చరణ్, ఓలివియా మోరిస్ మధ్య జరిగే సన్నివేశాలలో అల్లూరి సీతారామరాజుగా మహేష్ బాబు, అనుష్క శెట్టి మధ్య సన్నివేశాలనే కాకుండా.. మధ్యలో బ్రహ్మానందం కూడా వచ్చారు. అలాగే ప్రకాష్ రాజ్ ను కూడా చూపించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారుతున్నది.
మహేష్ బాబు ,రాజమౌళి డైరెక్షన్లోనే సినిమా చేస్తున్న సమయంలో ఇలాంటి వీడియోలను వైరల్ గా చేస్తున్నారు ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాలో నటిస్తూ ఉండగా రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోలు ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి.