కోలీవుడ్ హీరో ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం కుబేర. ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. రష్మిక హీరోయిన్గా నాగార్జున కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ధనుష్ నటనను చూసి ప్రతి ఒక్కరు ప్రశంసించారు. బిచ్చగాడుగా ధనుష్ అద్భుతంగా నటించారని..అటు అభిమానుల నుంచి స్టార్ హీరోల వరకు ధనుష్ నటనని ప్రతి ఒక్కరి చేత శభాష్ అనిపించేలా ఉన్నది. నిన్నటి రోజున రాత్రి సక్సెస్ మీట్ లో చిరంజీవి సైతం ధనుష్ పై ప్రశంసలు కురిపించారు.


కుబేర సక్సెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. దేవ క్యారెక్టర్ లో ధనుష్ తప్ప మరెవరు కూడా ఊహించుకోలేకపోయానని ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత అలా అనిపించింది అంటూ తెలిపారు చిరంజీవి. అసలు సినిమా చూస్తునంతసేపు కూడా ధనుష్ ను గుర్తించలేకపోయామని అంతలా ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయారు అంటు వెల్లడించారు. ఈ సినిమాని ఒక చిత్రంలా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ లా చూశానని కళ్ళముందే వాస్తవంగా జరుగుతున్నట్లుగా కనిపించిందంటూ తెలిపారు.


కుబేర సినిమా హృదయానికి చాలా హత్తుకుపోయేలా ఉందని దేవ క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉందని తెలిపారు. అంతటి స్టార్ డం ఉండి ఇలాంటి క్యారెక్టర్ చేయగలిగే యాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ధనుష్ మాత్రమే అని అది కూడా ఇండియాలో  ఇలాంటివారు ఒక్కరే ఉన్నారంటూ తెలిపారు. అంత న్యాచురల్ గా క్యారెక్టర్లలో నటించి మరి కనిపించారని తెలిపారు. ఈ సినిమాతో తనకి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా రావాలని తనకి అడ్వాన్సుగా కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తూ ఆయనకు రాకపోతే అసలు నేషనల్ అవార్డు అనే పదానికే కూడా అర్థం లేదని తెలియజేశారు. ఈ సినిమాకి అవార్డు కూడా వస్తే ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణంగా ఉంటుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: