
ఈ బ్యానర్ పై మెగా డాటర్ నిహారిక "కమిటీ కుర్రాళ్ళు" అనే సినిమాని కూడా నిర్మించింది. 2024 రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాతో వేరే లెవెల్ లోకి వెళ్లిపోయింది నిహారిక . యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన సినిమాగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ లో అవార్డులు కూడా అందుకుంది. కాగా తొలి ప్రయత్నంతోనే అందర్నీ మెప్పించిన నిహారిక ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై రెండో సినిమాను నిర్మించడానికి రెడీ అయింది .
మానస శర్మ దర్శకత్వంలో డైనమిక్ హీరో సంగీత్ శోభన్ హీరోగా ఆమె తన రెండవ సినిమాను నిర్మిస్తుంది . అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఆయ్, క వంటి సూపర్ హిట్ సినిమాలు నటించిన నయన్ సారికను చూస్ చేసుకుంది . సింగిల్ హీరోగా శోభన్ బాబు నటిస్తున్న ఫస్ట్ సినిమా ఇదే కావడం గమనార్హం . ఈ సినిమాలో వెన్నెల కిషోర్ - బ్రహ్మాజీ - తనికెళ్ల భరణి - గెటప్ శీను లాంటి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించబోతున్నారు. దీంతో పర్ఫెక్ట్ హీరోకి పర్ఫెక్ట్ హీరోయిన్ అంటూ ఓ రేంజ్ లో నీహారిక పై ప్రశంసలు కురిపిస్తున్నారు. విడాకుల తర్వాత లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు . కానీ అలాంటిది ఏదీకాదు అని మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని ప్రూవ్ చేసింది నిహారిక . మొత్తానికి అనుకున్నది సాధించి ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ స్థానాన్ని క్రియేట్ చేసుకుంది నీహారిక.నిహారిక ఈ విధంగా అభిమానులకి మరో గుడ్ న్యూస్ అందించిన్నట్లు అయ్యింది..!!
