అసలే చేతిలో సినిమాలు లేవు .. ఆశ‌లన్నీ ఆ ఒక్క‌ వెబ్ సిరీస్ పైనే ఉన్నాయి .. ఇప్పుడు అది కూడా ఆగిపోయిందనే టాక్ వినిపిస్తుంది . అయితే ఇలాంటి స‌మ‌యంలో సమంత ఏం చేయబోతుంది ? బాలీవుడ్ లో ఈమె ఫ్యూచర్ ఎలాంటి మలుపు తిరుగుతుంది ? నిజంగా ఈమె నటిస్తున్న రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ ఆగిపోయిందా ? అసలు దానికి కారణం ఏమిటి అనే విషయాలు ఇక్కడ చూద్దాం .. గత రెండేళ్ల క్రితం విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమాలో నటించాక .. టాలీవుడ్ వైపు చూడలేదు సమంత .. తన పూర్తి ఫోకస్ అంటే బాలీవుడ్ పైనే పెట్టుకున్నారు . పైగా సినిమాలు కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ లు మాత్రమే చేస్తూ వస్తున్నారు.
 

 ఇదే సమయంలో ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్‌ లాంటి సిరీస్ లతో ముంబాయికి తన మక్కం మార్చేసుకున్నారు సమంత .. ఇక ఇప్పుడు తాజాగా రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ చేస్తున్నారు ..  సిటాటిల్ షూటింగ్ దశలో ఉన్నప్పుడే ఈ సిరీస్ అనౌన్స్ చేశారు మేకర్స్ .. అయితే ఈ సిరీస్ ని కూడా రాజ్ డికేనే క్రియేట్ చేశారు .. సంవత్సరం కిందటే మొదలుపెట్టిన ఈ సిరీస్‌ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది .. ఇండోర్ టాకీ అంతా పూర్తయింది .. అవుట్ డోర్ యాక్షన్స్ సీక్వెన్సుల కోసం రెడీ అవుతున్నట్టు మేకర్స్ చెబుతున్నారు ..



అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఈ సిరీస్ ఆగిపోయింది అనే ప్రచారం గట్టిగా వినిపిస్తుంది .. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కారణంగా కోట్ల రూపాయలు స్కామ్ జరగడంతో రక్త్ బ్రహ్మాండ్ ను ఆపేయాలని నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుందని వార్తలు బయటికి వస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదని .. నెక్స్ట్ షెడ్యూల్ సమంత తో పాటు ఆదిత్య రాయ్ కపూర్ షూటింగ్లో పాల్గొంటారని అంటున్నారు .. రాజ్‌ డీకే .. ఇక మరోపక్క శుభం సినిమా తో నిర్మాతగా మారిన సమంత .. మా ఇంటి బంగారం సినిమాతో త్వరలోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: