శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించారు.. టాలీవుడ్ లో పేరున్న బ్యానర్లలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కూడా ఒకటి. ఇక ఈ బ్యానర్ లో సినిమాలు చేయాలని ఎంతో మంది హీరోలు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.అయితే తెర ముందు దిల్ రాజు పేరు వినిపించినప్పటికీ తెర వెనక దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డిసినిమా బ్యానర్ సక్సెస్ అవ్వడంలో ఎంతో కృషి చేశారని వీరి గురించి తెలిసిన వాళ్ళు అంటూ ఉంటారు. అయితే అలాంటి శిరీష్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని గేమ్ ఛేంజర్ వల్ల తమకు జరిగిన నష్టాలు అలాగే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.గేమ్ ఛేంజర్ ఫ్లాప్ గురించి మాట్లాడుతూ.. గేమ్ చేంజర్ వల్ల మా బతుకు అయిపోయిందని అనుకున్నాము.

కానీ అప్పుడే అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వల్ల బతికి బయటపడ్డాం. అనిల్ రావిపూడి లేకపోతే మేము ఉండే వాళ్ళం కాదు.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా గేమ్ ఛేంజర్ కి వచ్చిన దాదాపు 70% నష్టాలను పూడ్చివేసింది.. అయితే గేమ్ చేంజర్ కి ఎంత నష్టం వచ్చిందని చెప్తే బాగోదు. ఈ సినిమాకి నష్టం వస్తే డైరెక్టర్ ఫోన్ చేసి అడిగారా..రామ్ చరణ్ ఫోన్ చేసి అడిగారా... మాకు ఎవరు ఫోన్ చేసి ఏమీ మాట్లాడలేదు.అలాగే సినిమా ప్లాఫ్ అయితే రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేయండి అని అడిగేంత స్థాయికి కూడా మేము దిగజారలేదు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ ఎన్నో సినిమాలు నిర్మించారు.ఆయన తీసిన గుంటూరు కారం సినిమాకి మేం డిస్ట్రిబ్యూటర్స్ గా చేసాం.

కానీ ఆ సమయంలో దాదాపు 8 కోట్ల నష్టం వస్తే..నాగ వంశీ నాకెందుకులే అని పక్కన పెట్టకుండా మమ్మల్ని ఆ నష్టాల నుండి కాపాడారు. మ్యాడ్ స్క్వేర్ కి వచ్చిన లాభాలలో దాదాపు నాలుగు కోట్ల వరకు ఇచ్చి నష్టాలను పూడ్చారు.. ఇక మైత్రి మూవీ సంస్థ నక్క లాంటిది..మైత్రి మూవీ సంస్థకి నాగ వంశీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇందులో నాగ వంశీ నాగలోకం అయితే మైత్రి మూవీ సంస్థ నక్క అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శిరీష్ రెడ్డి.మరి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ని అవమానించేలా శిరీష్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మైత్రి మూవీ మేకర్ సంస్థ వాళ్ళు ఎలా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: