మన తెలుగు సినీ పరిశ్రమలో క్లాస్ దర్శకుల కంటే కూడా మాస్ సినిమాలను రూపొందించే దర్శకులకు కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇక మాస్ సినిమాలతో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్న వారిలో వి వి వినాయక్, శ్రీను వైట్ల కూడా ముందు వరసలోని ఉంటారు. వీరిద్దరూ కూడా చాలా సంవత్సరాల క్రితం దర్శకులుగా కెరియర్ను మొదలు పెట్టి కెరియర్ను మొదలు పెట్టిన దగ్గర నుండి మంచి విజయాలను అందుకుంటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ల స్థాయికి చేరుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లుగా కూడా కొంత కాలం కొనసాగిన వీరిద్దరూ ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాలను అందుకోవడంలో అత్యంత వెనుకబడిపోయారు. వినాయక్, మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఆఖరి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా 2017 వ సంవత్సరం జనవరిలో విడుదల అయ్యింది. ఈ మూవీ తర్వాత ఈయన రూపొందించిన ఇంటిలిజెంట్ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కొంతకాలం క్రితం వినాయక్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెలుగులో అద్భుతమైన విజయం సాధించిన చత్రపతి మూవీ ని హిందీ లో చత్రపతి అనే టైటిల్ తో రీమేక్ చేశాడు. ఈ సినిమా కూడా వినాయకు విజయాన్ని అందించలేకపోయింది. ఈ సినిమా తర్వాత వినాయక్ ఇప్పటివరకు సినిమాను మొదలు పెట్టలేదు. 

శ్రీను వైట్ల ఆఖరుగా దూకుడు మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీను వైట్ల "బాద్ షా" మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ పరవాలేదు అనే రేంజ్ విషయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన ఏ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించలేదు. ఆఖరుగా శ్రీను వైట్ల, గోపీచంద్ హీరోగా విశ్వం అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల కూడా ఏ మూవీ ని మొదలు పెట్టలేదు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లుగా కొనసాగిన వీరిద్దరూ నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తారు..? ఎలాంటి సినిమా చేస్తారు అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: