
కాగా దిల్ రాజు బ్రదర్ శిరీష్ మాటల సందర్భంలో "గేమ్ ఛేంజర్" సినిమా ఫ్లాప్ అయితే రాంచరణ్ పట్టించుకోలేదు అని చెప్పుకొచ్చాడు . దీంతో ఒక్కసారిగా మెగా ఫాన్స్ ఫైర్ అయిపోయారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ఆయనకి వార్నింగ్ ఇచ్చారు . అంతేనా సోషల్ మీడియాలో ఒక లెటర్ షేర్ చేస్తూ సివియర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంకొకసారి ఇలా మాట్లాడితే తాటతీస్తామంటూ వార్నింగ్ ఇస్తూ ఆరు పాయింట్ లో ఉన్న పేజీని వైరల్ చేశారు. దీంతో ఎట్టకేలకు దిల్ రాజు ఈ ఇష్యూ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు .
ఇక వల్ల కాదు అనుకోని శిరీష్ రెడ్డి ఓపెన్ గానే బహిరంగంగా క్షమాపణలు కోరుతూ నోట్ రిలీజ్ చేశారు . "నేను మాట్లాడిన మాటలు ఎవరినైనా రామ్ చరణ్ ఫాన్స్ ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి " అంటూ ఆయన ఒక నోట్ రిలీజ్ చేశారు. దీనితో పరిస్థితి అంతా సర్దుమనిగేలా నే సిచువేషన్ వచ్చింది . అయితే ఈ గొడవలో శిరీష్ ఇమేజ్ డామేజ్ అవ్వడం రాంచరణ్ ఫ్యాన్స్ ఇబ్బంది పడడం జరిగిన రామ్ చరణ్ "పెద్ది" సినిమాకి మాత్రం మంచి క్రేజ్ పబ్లిసిటీ వచ్చేసింది. రామ్ చరణ్ కచ్చితంగా ఈ "పెద్ది" సినిమాతో హిట్టు కొట్టి ఇలాంటి వాళ్ళ నోర్లు మూయిస్తారు అని మెగా ఫాన్స్ ఓ రేంజ్ లో పెద్ది సినిమాకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు . వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న "పెద్ది" సినిమాని మాత్రం హైలెట్ చేసేసారు . సోషల్ మీడియాలో ఇప్పుడు దీని గురించి పెద్ద డిస్కషన్స్ జరుగుతున్నాయి . చూడాలి మరి ఈ "పెద్ది" సినిమా రామ్ చరణ్ కి ఎలా కలిసి వస్తుందో..???