
జులై 3వ తేదీన ఉదయం 11:10 గంటలకు ట్రైలర్ విడుదల కాబోతున్నట్లు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఈ ట్రైలర్ చూసి ఎంజాయ్ చేస్తున్న వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నారు. అయితే ట్రైలర్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా డైరెక్టర్ ను మెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. అలాగే చాలా కష్టపడ్డావు అంటూ చాలా ఆత్మీయంగా కూడా డైరెక్టర్ ను హత్తుకున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా తన ఉత్సాహాన్ని అదుపు చేసుకోలేకపోయారు అంటూ నిర్మాత సంస్థ వెల్లడించింది. ట్రైలర్ చూడడానికి త్రివిక్రమ్ కూడా వచ్చినట్లు కనిపిస్తోంది.
ఈ సినిమాని మొదట డైరెక్టర్ క్రిష్ కొంత భాగం పెరకెక్కించిన కొన్ని కారణాల చేత తప్పుకోవడంతో నిర్మాత ఎయం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు ఇందులో పవన్ కి జోడిగా నిధి అగర్వాల్ నటించగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇందులో చారిత్రక యోధుడిగా కనిపించబోతున్నారు. కీలకమైన పాత్రలో కూడా పలువురు నటీనటులు నటిస్తూ ఉన్నారు మొదటి భాగం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ట్రైలర్ తో అన్ని రూమర్స్ కి చెక్ పెట్టే విధంగా హరిహర వీరమల్లు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.