
మోహన్ లాల్ ..శరత్ కుమార్.. అక్షయ్ కుమార్ ..కాజల్ ..మోహన్ బాబు ఇలా పలువురు కన్నప్ప చిత్రంలో నటించి మెప్పించారు . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ ట్రోలింగ్ కి గురవుతున్నారు . అక్షయ్ కుమార్ శివుడిగా కాజల్ అగర్వాల్ పార్వతి దేవిగా యాక్ట్ చేశారు. వీళ్ళపై సోషల్ మీడియాలో ఏ రకమైన ట్రోలింగ్ జరిగింది అనేది అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్స్ కూడా అసలు వాళ్ళిద్దరిని శివుడిగా పార్వతి చూడలేకపోయాం అంటూ ఘాతూగా రియాక్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు సినిమాకి నెగిటివిటీ తీసుకొచ్చేలా మరొక న్యూస్ తెరపైకి వచ్చింది . అక్షయ్ కుమార్ ఈ సినిమాలో శివుడి క్యారెక్టర్ లో కనిపించాడు .
అయితే అక్షయ్ కుమార్ ఈ సినిమా కోసం డైలాగ్ లు నేర్చుకుని సొంతంగా చెప్పినట్లు అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యింది. అయితే అదంతా ఫేక్ అని ఆయన అసలు సొంతంగా డైలాగ్ చెప్పలేదు అని అదంతా టెలిప్రాంప్టర్ ని చూస్తూ అక్కడ రాసిన డైలాగ్స్ చదువుతున్నాడు అన్నట్లు కొన్ని పిక్చర్స్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అది అతడి కళ్ళు తిప్పడం చూస్తే ఈజీగా అర్థమవుతుంది. దీంతో దారుణంగా జనాలు ట్రోల్ చేస్తున్నారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న ఇప్పటికి డైలాగ్స్ గుర్తుపెట్టుకుని చెప్పలేవా..? ఎందుకు ఇలా సగం సగం యాక్టింగ్..? శివుడు వేషం కట్టుకుని చిన్న డైలాగ్స్ కూడా చెప్పడం రాకపోతే నువ్వెందుకు నీకు హీరోగా ఈ స్టేటస్ ఎందుకు ..? రెమ్యూనరేషన్ మాత్రం మళ్లీ తీసుకుంటారే అంటూ ఘాటుఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . మరి కొంతమంది నువ్వు చీట్ చేసావ్ .. అందుకే ఈ సినిమా కలెక్షన్స్ తీసుకురాలేకపోయింది అంటూ ఘాటు గా కామెంట్స్ పెడుతున్నారు . దీంతో కన్నప్ప సినిమాకి మరింత నెగిటివిటి ఏర్పడిపోయింది..!!