
హుమైరా అస్ఘర్ అలీ 2022లో ఏఆర్ఐడై అనే డిజిటల్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అందులో కూడా బాగానే గుర్తింపు సంపాదించుకున్న ఈమె 2023లో నేషనల్ ఉమెన్ లీడర్షిప్ అవార్డులో కూడా ఉత్తమ ప్రతిభను అందుకున్నది.అది ఈమె గత కొన్నేళ్లుగా కరాచీలోని ఒక అద్దె ఇంట్లో నివాసం ఉండేదట. 2024లో రెంట్ కట్టడం లేదని ఆమె ఖాళీ చేయించాలంటు ఆ ఇంటి యజమాని కోర్టుకు వెళ్లగా అది ఆయనకు అనుకూలంగా తీర్పు లభించింది.
ఈ నేపథ్యంలోనే హుమైరా అస్ఘర్ అలీ అపార్ట్మెంట్ ని గత మంగళవారం పోలీసులు ఓపెన్ చేయగా ఈ నటి కుళ్ళిపోయిన దశలో మృతదేహాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో ఈమె గత ఏడాది అక్టోబర్ నెలలోనే మరణించి ఉండవచ్చని నివేదికలు తెలియజేస్తున్నాయి. పోస్టుమార్టం కోసం కరాచీ పోలీసులు చేయించారు. సుమారుగా తొమ్మిది నెలల క్రితమే ఈనాటి మరణించి ఉండవచ్చని అధికారులు కూడా తెలుపుతున్నారు. ఆ ఇంటికి బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారని తెలియజేశారట. అంతేకాకుండా ఆమె ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయాయని.. జాడీలు కూడా తుప్పు పట్టి ఉన్నాయని తెలుపుతున్నారు. ఆమె ఉండేటువంటి ఫ్లోర్లో ఈమె తప్ప ఎవరూ ఉండేవారు కాదని అందుకే అక్కడ ఎవరికీ దుర్వాసన రాలేదని అధికారులు వెల్లడించారు. ఆమె బాల్కనీ తలుపులు కేవలం ఒకటి మాత్రమే ఓపెన్ లో ఉందని కొళాయి నీటి పైపులు ఎండిపోయాయని తెలిపారు.